పోస్ట్‌లు

సెప్టెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

పూరీ గారు కులం చూడకుండా నాకలం దమ్ము చూసి నాకో అవకాశం ఇవ్వండి.

 తెలుగు సినిమా దర్శకులు పూరీ జగన్నాథ్ గారికి, ఓ దళిత యువకుడు రాసుకొను విన్నపము. సర్, నేను అంటరాని కులంలోను పేదరికంలోను జన్మించిన వాడిని. మేము ప్రభుత్వం నెల నెలా అందించే రేషన్ తీసుకుని బ్రతికే బడుగు బలహీన వర్గాల వారిమి. అలాగే ప్రభుత్వం ఉచితంగా అందించే తెలుగు మీడియం విద్యను అభ్యసించిన వాడిని. అంతేకాక ప్రభుత్వం ఉచితంగా అందించే వైద్య సదుపాయాలు సైతం పొందే పేదలం. సర్ మాకూ మగ్గిపోయిన పురుగులు పట్టిన కంపు కొట్టే రేషన్ బియ్యం తినాలని వుండదు కాని 365 రోజులూ కూలి కెళ్ళినా మంచి బియ్యం కొనడానికి డబ్బులు చాలవు.  ఎందుకంటే అందరి జీతాలు పెరుగుతాయి, నిత్యవసరాల ధరలూ పెరుగుతాయి కాని మా కూలి రేట్లు మాత్రం పెరగవుగా. సర్ నేను ఒళ్ళు దగ్గర పెట్టుకునే చదివాను కాబట్టే ఫెయిల్ అవ్వాల్సిన వాడిని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా. నన్నెవరూ ప్రోత్సహించలేదు , వెన్ను తట్టి ముందుకు నడిపించలేదు నాకు నేనే సర్ధి చెప్పుకుంటూ నన్ను నేనే ప్రోత్సహించుకుంటూ చదివా. ఇంకెవరైనా ప్రోత్సహించి ఉండి యుండుంటే ఇంకా బాగా చదివే వాడినేమో. మేము పేదలం కదా తెలుగు మీడియమే మాకు ఎక్కువ సర్ అందుకే ఏ అవకాశాలు లేని తెలుగు మీడియంలో చదివా. నేను డిగ్...