జైభీమ్
'జై భీమ్' జై భీమ్ అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే వ్యక్తి డాక్టర్.బీ.ఆర్.అంబేడ్కర్ గారే. అంబేడ్కర్ గారిని మన దేశమే కులం మరక వేసి కూకటి వేళ్ళతో పెకిలించాలనుకున్నా గాని ఆయన రాసిన రాజ్యాంగంను బట్టైనా ఆయనను స్మరించుకోక తప్పదు. మన తెలుగు సినీ పరిశ్రమ మొత్తం దినసరి కూలీలంతా ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాల వారే కెమెరా ట్రాలీలు మోసే వారి దగ్గర నుండి హీరోల కార్లు నడిపే వరకు అంతా దాదాపు ఎక్కువ శాతం వారే కాని ఏసినిమాలోను వారి కథలు గాని వ్యధలు గాని ఉండవ్. అంతేకాదు అంబెడ్కర్ అనే మహనీయుని ఫోటో కూడా తగిలించకుండా జాగ్రత్త పడతారు అనేది వాస్తవ సత్యం! అసలు ఈసినిమాకు అంబేడ్కర్ కు ఏసంబంధం లేదు ఈటైటిల్ ఏమిటని కొందరనుకోవచ్చు కాని ఈసినిమా ఆత్మ అంబేడ్కర్ గారి ఆశయ స్ఫూర్తి. ఇది ఒక నిజ జీవిత కథ. తమిళనాడులోని లాయర్ చంద్రు గారి నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈకథను తెరకెక్కించారు. లాయర్ చంద్రూ గారు నిస్వార్ధంగా నిజాయితీగా తన కర్తవ్య బాధ్యతను నెరవేర్చబట్టి అంబేడ్కర్ గారి ఆశయ స్ఫూర్తిని కలిగి ఆయన అమాయక ఖైధీలైన పేదవారి పక్షాన ఆయన నిలబడి న్యాయానికి మూయబడ్డ గంతలు తెరిపించి నిజాలను వెలుగులోకి తేబట్టే న...