కులం మరక - మతం మచ్చ
కులం మరక - మతం మచ్చ కులమేమో గుడిసేటిది మతమేమో మైనారిటీలది కులానికి - మతానికి లింకు పెట్టి మా బ్రతుకులు బుగ్గిపాలు చేసారు. నేటికీ కులం మరక తొలగని పోట్లు పోడుస్తూనే వున్నారు మతం మచ్చ రుద్దుచూనే వున్నారు నాడు దైవ దర్శనమునకు భాగ్యం లేదు నేడు దైవమే మాచెెంతకు చేరినా మాకు భాగ్యం లేదు! అదేమిటో నేడు అగ్ర కులస్థులు, బ్రాహ్మణోత్తములు సైతం క్రైస్తవ్యం స్వీకరించినా వారికి అంటని మచ్చ మాకే అంటింది! చిత్రం నేడు ఆ ఉత్తమోత్తములందరిని మా గురు స్థానములలో పైస్థాయిలో ఉండి మాకు క్రైస్తవ్యమును బోధించటం వల్ల దశమ భాగాలతో పోషించేది దరిద్ర హీనులమైన మేమే! కేవలం మతం మారినందుకే మాకు ప్రభుత్వ ఫీజు రాయితీ లేదు, ఏ రాయితీ లేదు అప్లికేషన్లకు అధిక రుసుం చెల్లించాలి ఉద్యోగాలలో ఒకే ఒక్క సీటు కూలి రేట్లు పెరగవు మా బ్రతుకులూ మారవు కూలి నాలికి పోయినా అక్కడా కులం పోట్లు తప్పవు హీనులంటూ దూరం దూరంగా జరిగేవారూ లేకపోలేదు డిగ్రీలు పట్టాలు చేతిలో వున్నా మా బ్రతుకు పట్టాలు మాత్రం ఎక్కవుగా! ఎన్నో ఏళ్ళ ప్రభుత్వ అంధత్వ పాలనకు నిలువెత్తు సాక్ష్యం మా బ్రతుకులు! ఎందరో క్రైస్తవులుగా మారినా క్రైస్తవులంటే మాత్రం మ...