కులం మరక - మతం మచ్చ
కులం మరక - మతం మచ్చ
కులమేమో గుడిసేటిది
మతమేమో మైనారిటీలది
కులానికి - మతానికి లింకు పెట్టి
మా బ్రతుకులు బుగ్గిపాలు చేసారు.
నేటికీ కులం మరక తొలగని పోట్లు పోడుస్తూనే వున్నారు
మతం మచ్చ రుద్దుచూనే వున్నారు
నాడు దైవ దర్శనమునకు భాగ్యం లేదు
నేడు దైవమే మాచెెంతకు చేరినా మాకు భాగ్యం లేదు!
అదేమిటో నేడు అగ్ర కులస్థులు, బ్రాహ్మణోత్తములు సైతం క్రైస్తవ్యం స్వీకరించినా వారికి అంటని మచ్చ మాకే అంటింది!
చిత్రం నేడు ఆ ఉత్తమోత్తములందరిని మా గురు స్థానములలో పైస్థాయిలో ఉండి మాకు క్రైస్తవ్యమును బోధించటం వల్ల దశమ భాగాలతో పోషించేది దరిద్ర హీనులమైన మేమే!
కేవలం మతం మారినందుకే మాకు ప్రభుత్వ ఫీజు రాయితీ లేదు, ఏ రాయితీ లేదు
అప్లికేషన్లకు అధిక రుసుం చెల్లించాలి
ఉద్యోగాలలో ఒకే ఒక్క సీటు
కూలి రేట్లు పెరగవు మా బ్రతుకులూ మారవు
కూలి నాలికి పోయినా అక్కడా కులం పోట్లు తప్పవు
హీనులంటూ దూరం దూరంగా జరిగేవారూ లేకపోలేదు
డిగ్రీలు పట్టాలు చేతిలో వున్నా
మా బ్రతుకు పట్టాలు మాత్రం ఎక్కవుగా!
ఎన్నో ఏళ్ళ ప్రభుత్వ అంధత్వ పాలనకు నిలువెత్తు సాక్ష్యం మా బ్రతుకులు!
ఎందరో క్రైస్తవులుగా మారినా క్రైస్తవులంటే మాత్రం మేమే!
మా ఓట్లేమో మీరు దండుకుని
మా పాట్లేవో మమ్మల్ని పడమని
మా బ్రతుకులు అలా గాలికొదిలేస్తారు
చట్టాలన్నీ మీచుట్టంలా సవరించుకుంటారే గాని
మాబ్రతుకు చట్టాలు మాత్రం సవరించలేరు!
నా అంటరాని కులంలో నేను పడే పాట్లు ఇవి
నేడు అన్ని కులాలలో నిరుపేదలున్నారు నిజం.
కేవలం కులాల వారీగా న్యాయం చేయాలంటే లబ్దీ చేకూరిన వాడే మరో లబ్దీ పొందుచున్నాడని మీరంటున్నారు
ఐతే
కులాల వివక్ష పూర్తిగా రూపు మాపి
కుల వ్యవస్థ కూకటి వేళ్ళతో పెకలించి
అప్పుడు పేద ధనిక వర్గాలను విభజించి
పేదలందరికీ సమన్యాయం చేకూర్చండి.
కుల హీనుడను నేను కానోయ్
ఆ హీన దృష్టి నీలోనే ఉందోయ్
నేనూ నీలాంటి నరావతారుడనే
నన్నూ నీలా బ్రతకనియ్
ఇంకెన్ని యుగాలు నీ వివక్ష చూపతావు
కరోనా వచ్చి నీకే ఆవివక్ష రుచి చూపింది
మరణశయ్యలోనైనా తెలుసుకో వివక్ష ఎంత దారుణంగా ఉంటుందోనని!
గొప్ప కులంలో పుట్టి పోనీ నీవేమైనా స్వర్గంలో బ్రతుకుచున్నావా
లేదే నాలా నేల మీదే బ్రతుకుచున్నావు
పోనీ నీకు ఆకలి దప్పులేమైనా ఉండవా
లేదే అదే ఆకలి అదే దాహం
కుల హీనుడనని మాయ రోగం నాకే వస్తుందా
లేదే నీకూ వస్తుంది
నువ్వూ నాలాగే బ్రతకాలి
నాలాగే మరణించాలి.
ఇన్ని యుగాలన్నీ పరిశోధించి పరిశోధించి తరచి చూస్తే నాకర్ధమైందేమిటంటే
కరోనా కన్నా భయంకరమైన మాయ రోగం నీకు సోకిందని
ఆరోగంతో ఎన్నో బ్రతుకులు చీకటి యుగాలలోకి నెట్టేసారు మీరు!
మీ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు
ఎందుకంటే అది యుగయుగాలకు మాయని మరకగా వేసారు మీరు !
నేటికీ మారలేదు ఇక ముందూ మారరు మీరు
ఎందుకంటే మీకంటే మూర్ఖులు మరెవ్వరూ లేరు.
ఏ భగవంతుడు భగ భగ మండుచూ మీకోసం దివి నుండి భువికి దిగి రావాలో మరి మీ మేధస్సులలో చీడ తొలగించడానికి!
- శీలం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి