ఆకాశం నీ హద్దురా...!



ఆకాశం నీ హద్దురా...!

ఈరోజే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.

కమల్ హాసన్ గారు విశ్వరూపం రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడి ఆయన తన సినిమాను ఆన్లైన్ లో రిలీజ్ చేస్తానన్నారు.

ఈమధ్య రాంగోపాల్ వర్మ గారు కరోనా వచ్చి జనాలంతా సినిమా ధియేటర్లకు కూడా వెళ్ళే పరిస్ధితి సరికదా సినిమాలు తీసే పరిస్థితే లేదు ఐనా ఆయన మాత్రం తక్కువ బడ్జెట్ సినిమాలు తీసేసి ఆన్లైన్ లో(ఎనీ టైమ్  ధియేటర్ - ATT) రిలీజ్ చేసేసి సొమ్ము చేసుకున్నారు.

సూర్యగారు ధైర్యం చేసి జ్యోతిక గారితో తీసిన పొన్ మాగల్ వందాల్ (బంగారు తల్లి) సినిమాను (ఓవర్ ద టాప్ - OTT) అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసి విజయం సాధించారు.

మరల ఇప్పుడు సూర్య గారే నటించి నిర్మించిన ఆకాశం నీ హద్దురా సినిమాను ఇవాళ అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేశారు. 

సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే ఉండటమే కాక మంచి విజయాన్ని నమోదుచేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

దర్శకురాలు సూర్య గారి దగ్గరకు పూర్తి బౌండెడ్ స్రిప్ట్ తో ఆమె వెళ్ళలేదు ఒక పుస్తకం తీసుకువెళ్ళి కథ చెప్పి చదవమన్నారట. ఆయన ముందు షాక్ అయ్యి తర్వాత కథ నచ్చి సినిమాను చేసారు!

ఒక సామాన్యుడు కలల ప్రపంచం నిజమై అతడు ఆకాశమే హద్దుగా ఎదిగి పయనించే కలల స్వప్నం ఈ సినిమా.

అలాగే మన దేశంలో రతన్ టాటా లాంటి వారే ఎదగడానికి ఎన్నో కారణాలతో ఏళ్ళ తరబడి ప్రాజెక్ట్ లు ఓకే కాక ఇబ్బందులతో అది వదిలేసుకున్న సంఘటనలు నిజంగా నిజమే అటువంటిది సామాన్యులు పైకెదగాలంటే అడుగడుగునా ఎన్ని అవరోధాలు అధిగమించాలో ఈసినిమాలో చూపించారు.

సూర్యగారు వైవిధ్యమైన పాత్రలు నటించి మెప్పించడంలో ఆయనకు ఆయనేసాటి. ఈసినిమాలో కూడా నటనలో మరలా పలు వైవిధ్యాలు చూపారు.

ఈ సినిమా  నా వరకు ఐతే సూపర్. ఎందుకంటే మా మధ్య తరగతి బ్రతుకుల కలలే చూపారు ఇందులో. ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చే సినిమా.

ఇక మన తెలుగు హీరోలు కూడా నిరభ్యంతరంగా ATT, OTT లలో సినిమాలు రిలీజ్ చేసుకుని విజయం సాధించవచ్చు.

సత్తా వున్న ప్రతివాడు తమ సత్తా చాటుకునే ఆన్లైన్ వేధిక OTT, ATT లు.

సూర్య గారిలా ఆకాశమే నీ హద్దుగా ఆన్లైన్ విహంగంలో ఇక విహరించు మరి.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొన్నిసార్లు..... పక్షులకు లేని వీసాలు, పాస్ పోర్టులు మనకెందుకు అనిపిస్తుంటుంది!