కొన్నిసార్లు..... పక్షులకు లేని వీసాలు, పాస్ పోర్టులు మనకెందుకు అనిపిస్తుంటుంది!

కొన్నిసార్లు.....
డార్విన్ సిద్దాంతం ఒక్కోసారి అక్షరాలా నిజమనిపిస్తుంటుంది.

'బలమైన జీవులన్నీ మనుగడ సాగిస్తాయి
బలహీనమైన జీవులన్నీ మనుగడ కొనసాగించలేవు'

ఉదహరణకు పులి జింకను వేటాడినపుడు పులి జింకను చంపి తిని అది మనుగడ సాగిస్తుంది కదా.



నేడు ప్రపంచమంతా కరోనా కోరలు చాచి ప్రపంచ మానవాళి ఉనికిని ఒకసారి చిన్నాభిన్నం చేసింది!


ఈవ్యాధి సోకితే రోగ నిరోధక శక్తి కల్గిన వారు కోలుకుంటున్నారు
రోగ నిరోధక శక్తి లేని వారు త్వరగా అనారోగ్యం పాలై కొద్ది రోజుల వ్యవధిలోనే మరణిస్తున్నారు.

ఇది గమనిస్తే డార్విన్ సిద్దాంతం నూటికి నూరుపాళ్ళు నిజం అనిపిస్తుంది కదా!


కొన్నిసార్లు.....
పక్షులకు లేని వీసాలు, పాస్ పోర్టులు మనకెందుకు అనిపిస్తుంటుంది!



ఈప్రపంచమంతా మనదే కదా మరి మనం ఎందుకని వేరే దేశం వెళ్ళాలంటే అక్కడి అనుమతి తీసుకోవాలి, అక్కడకు వెళ్ళాక మన గుర్తింపును ధృవపరిచే పాస్ పోర్ట్ ను ఎందుకు చూపాలి?!
మనమేమైనా వేరే గ్రహవాసులమా కాదు కదా!



ప్రతీ దేశానికి అక్కడి చట్టాలు, వారి దేశీయ ఆర్ధిక పురోభివృధ్ధి కారణంగా ఒక్కోసారి డబ్బున్నా వారి అనుమతులు లేకుండా మనం మన ప్రపంచంలోనే మరో దేశంలోకి ప్రవేశించలేం, ఒకవేళ ప్రవేశిస్తే చట్టాలు మీరినందుకు శిక్షలుంటాయి!

పక్షులు విదేశాల నుండి వలస వస్తుంటాయి కదా వాటికి ఏ వీసా పాస్ పోర్ట్ అవసరం లేదు పైగా అవి పైకం కూడా చెల్లించాల్సిన పనేలేదు.
అవి ప్రకృతి నియమం(చట్టం) పాటిస్తాయి.

విచిత్రమేమిటంటే ప్రకృతి నియమం(చట్టం) మీరిన మనుషులకు ఏ శిక్షలు లేవు!
వీరికి ఎవరు విధించాలి శిక్షలు.

ప్రకృతిని అన్నీ రకాలుగా నాశనం చేస్తున్న మానవాళి మొత్తానికి ప్రకృతిలోని జీవరాసులన్నీ కూడా శిక్షలు విధిస్తే!
అవి చేయలేవు కాబట్టే వాటి తరపుగా ఒక్కోసారి ప్రకృతే వికృతంగా విరుచుకు పడుతుంటుంది

కాని పాపం ఆసమయంలో కేవలం మానవాళి మాత్రమే కాక మిగిలిన జీవరాసులు కూడా బలైపోతాయి, పాపం ఏపాపం ఎరుగని అమాయకులు చట్టాలకు బలైపోయినట్లు ప్రకృతి ప్రకోపానికి ప్రకృతిలోని ఏపాపం ఎరుగని మూగజీవాలన్నీ బలైపోతుంటాయి.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకాశం నీ హద్దురా...!