సరికొత్త కథలు, ఐడియాలు అమ్ముకోవడం ఎలా?

 

నాకు చాలా కాలం నుండి ఒక ఆలోచన మనసును తొలిచేస్తూ వుండేది.

రచయిత అనేవాడు ఒక క్రియేటర్ అంటే కథను సృష్టించేవాడు.

కాని కథా సృష్టికర్తకు నేడు మన పరిశ్రమలో ఎంత విలువ ఉందనేది అక్కడ పరిశ్రమలో వున్న వారికే అనుభవ పూర్వకముగా తెలియాలి.

మనం 2021 లో ఉన్నాం అంటే టెక్నాలజీ మన అరచేతులలోకి వచ్చేసింది.

నేటి రోజులలో కూడా రచయిత వందల కథలు పట్టుకుని కాళ్ళరిగేలా కృష్ణానగర్ లో తిరిగే రోజులు పోవాలంటే ఏం చేయాలి అని నా మనసు తొలిచేసేది!

ఒక్క కృష్ణానగర్ లోనే కాదు నాలాగా పల్లెటూళ్ళల్లో సైతం సినిమాలంటే పిచ్చితో కథలు రాసుకుని (కథా స్క్రీన్ ప్లే ఫార్మాట్ తెలియకపోయినా) ఎలా అప్రోచ్ కావాలో తెలియక అటు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్న ఊళ్ళోనుండి కదల్లేక మరుగున పడిన మాణిక్యంలా అలా ఉండిపోయేవారూ కోకొల్లలే.

కాని చిత్రమేమిటంటే చిత్ర పరిశ్రమలో కథల కొరత! కథా రచయితల కొరత!

అసలు దీని గురించి "గూగుల్ తల్లి"ని అడిగితే పోలా అని 'How to sell movie ideas' అని టైప్ చేస్తే అది దాని డేటా బేస్ మొత్తం వెదికి కొన్ని వెబ్ సైట్ల్ చూపించింది.

ఇందులో ఫారిన్ వాళ్ళ హాలీవుడ్(Hollywood) వెబ్ సైట్స్  ఉన్నాయి.

వీళ్ళు కొన్ని కాంటెస్ట్స్ నిర్వహించి కాంపిటేషన్స్ కూడా పెడతారు.

( అబ్బ నాకు ఆంగ్లం చదవడం రాయడం మాత్రమే వచ్చు మాట్లాడటం భాషను అర్థం చేసుకోగలడం కూడా వచ్చుంటే ఆ కాంపిటేషన్ కు అప్లై చేసుండేవాడిననిపించింది. ఎందుకంటే సింగీతం శ్రీనివాసరావు గారన్నట్లు నాకథ నాకు గొప్పది అనే భావన).

ఆవెదుకులాటలో మన ఇండియన్ వెబ్ సైట్ ఒకటి నాకంటబడినది.
"Global Content Bazar India" కూడా వుంది.

ఇందులో మన ఐడియాలు, మన స్క్రీన్ ప్లే  కొంత రుసుముతో రిజిస్టర్ చేసుకుంటే ఆ వెబ్ సైట్ చూసే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా కొంత మనీ పే చేసి కథలు చదివి నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు.
అంతే కాదు మీరే దర్శకత్వం చేసేట్లైతే ప్రొడ్యూస్ చేస్తారు కూడా.

మన తెలుగు పరిశ్రమలో కూడా ఇలా ఇటువంటిది ఉంటే బావుండు అనిపించింది.

ఇది మన తెలంగాణా ప్రభుత్వం వారు "తెలుగు సినిమా కథల నిథి" గా ఆన్లైన్ లోనే గ్రామీణ ప్రాంతాల వారు సైతం కథ కొంత రుసుముతో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ కు అఫీషియల్ గా "ఆన్లైన్ స్టోరీ సెల్లింగ్"( Online Story Selling)  ఎందుకు పెట్టకూడదు?

లేదా రచయితలంతా ఒక తాటిపై వుండి వారే దీనిని ఎందుకు నిర్వహించగూడదు, క్రొత్త వారికి కూడా ఎందుకు ఇలా అవకాశం ఇవ్వగూడదు.

కొంతమంది ఏమంటారంటే నీకథను అమ్ముకుంటే నిన్ను నీవు అమ్ముకున్నట్లేనని కాని నేడు సినిమా అనేది ఒక పెద్ద వ్యాపార మాధ్యమం. అటువంటప్పుడు మన కంటెంట్ ఎవరి ద్వారానైనా ఏ రూపంలోనైనా జనాలను చేరడం ముఖ్యం.

ఇందులో పెద్ద సమస్య కూడా లేకపోలేదు ఒక మంచి కథను కొనుక్కున్న దర్శకుడో నిర్మాతో చెడ గొట్టేస్తాడేమోనని భయపడతారేమో ఇప్పుడు అటువంటి పరిస్థితులు తలెత్తవనుకుంటున్నా ఎందుకంటే ఓటటి వల్ల వాళ్ళు కూడా అప్డేట్ అయ్యారు ఎన్నో రీజనల్ సినిమాలు చూసైనా వారు మారే వుంటారని భావిస్తున్నా.

మీ
శీలం రమేష్ కుమార్
వైవాక
మొబైల్: 9010675050
ఈమెయిల్: seelamrameshkumar@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొన్నిసార్లు..... పక్షులకు లేని వీసాలు, పాస్ పోర్టులు మనకెందుకు అనిపిస్తుంటుంది!

ఆకాశం నీ హద్దురా...!