పోస్ట్‌లు

జైభీమ్

 'జై భీమ్' జై భీమ్ అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే వ్యక్తి డాక్టర్.బీ.ఆర్.అంబేడ్కర్ గారే. అంబేడ్కర్ గారిని మన దేశమే కులం మరక వేసి కూకటి వేళ్ళతో పెకిలించాలనుకున్నా గాని ఆయన రాసిన రాజ్యాంగంను బట్టైనా ఆయనను స్మరించుకోక తప్పదు. మన తెలుగు సినీ పరిశ్రమ మొత్తం దినసరి కూలీలంతా ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాల వారే కెమెరా ట్రాలీలు మోసే వారి దగ్గర నుండి హీరోల కార్లు నడిపే వరకు అంతా దాదాపు ఎక్కువ శాతం వారే కాని ఏసినిమాలోను  వారి కథలు గాని వ్యధలు గాని ఉండవ్. అంతేకాదు అంబెడ్కర్ అనే మహనీయుని ఫోటో కూడా తగిలించకుండా జాగ్రత్త పడతారు అనేది వాస్తవ సత్యం! అసలు ఈసినిమాకు అంబేడ్కర్ కు ఏసంబంధం లేదు ఈటైటిల్ ఏమిటని కొందరనుకోవచ్చు కాని ఈసినిమా ఆత్మ అంబేడ్కర్ గారి ఆశయ స్ఫూర్తి. ఇది ఒక నిజ జీవిత కథ. తమిళనాడులోని లాయర్ చంద్రు గారి నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈకథను తెరకెక్కించారు. లాయర్ చంద్రూ గారు నిస్వార్ధంగా నిజాయితీగా తన కర్తవ్య బాధ్యతను నెరవేర్చబట్టి అంబేడ్కర్ గారి ఆశయ స్ఫూర్తిని కలిగి ఆయన అమాయక ఖైధీలైన పేదవారి పక్షాన ఆయన నిలబడి న్యాయానికి మూయబడ్డ గంతలు తెరిపించి నిజాలను వెలుగులోకి తేబట్టే న...

సరికొత్త కథలు, ఐడియాలు అమ్ముకోవడం ఎలా?

  నాకు చాలా కాలం నుండి ఒక ఆలోచన మనసును తొలిచేస్తూ వుండేది. రచయిత అనేవాడు ఒక క్రియేటర్ అంటే కథను సృష్టించేవాడు. కాని కథా సృష్టికర్తకు నేడు మన పరిశ్రమలో ఎంత విలువ ఉందనేది అక్కడ పరిశ్రమలో వున్న వారికే అనుభవ పూర్వకముగా తెలియాలి. మనం 2021 లో ఉన్నాం అంటే టెక్నాలజీ మన అరచేతులలోకి వచ్చేసింది. నేటి రోజులలో కూడా రచయిత వందల కథలు పట్టుకుని కాళ్ళరిగేలా కృష్ణానగర్ లో తిరిగే రోజులు పోవాలంటే ఏం చేయాలి అని నా మనసు తొలిచేసేది! ఒక్క కృష్ణానగర్ లోనే కాదు నాలాగా పల్లెటూళ్ళల్లో సైతం సినిమాలంటే పిచ్చితో కథలు రాసుకుని (కథా స్క్రీన్ ప్లే ఫార్మాట్ తెలియకపోయినా) ఎలా అప్రోచ్ కావాలో తెలియక అటు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్న ఊళ్ళోనుండి కదల్లేక మరుగున పడిన మాణిక్యంలా అలా ఉండిపోయేవారూ కోకొల్లలే. కాని చిత్రమేమిటంటే చిత్ర పరిశ్రమలో కథల కొరత! కథా రచయితల కొరత! అసలు దీని గురించి "గూగుల్ తల్లి"ని అడిగితే పోలా అని 'How to sell movie ideas' అని టైప్ చేస్తే అది దాని డేటా బేస్ మొత్తం వెదికి కొన్ని వెబ్ సైట్ల్ చూపించింది. ఇందులో ఫారిన్ వాళ్ళ హాలీవుడ్(Hollywood) వెబ్ సైట్స్  ఉన్నాయి. వీళ్ళు కొన్ని కాంటెస్ట్...

ఆకాశం నీ హద్దురా...!

చిత్రం
ఆకాశం నీ హద్దురా...! ఈరోజే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. కమల్ హాసన్ గారు విశ్వరూపం రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడి ఆయన తన సినిమాను ఆన్లైన్ లో రిలీజ్ చేస్తానన్నారు. ఈమధ్య రాంగోపాల్ వర్మ గారు కరోనా వచ్చి జనాలంతా సినిమా ధియేటర్లకు కూడా వెళ్ళే పరిస్ధితి సరికదా సినిమాలు తీసే పరిస్థితే లేదు ఐనా ఆయన మాత్రం తక్కువ బడ్జెట్ సినిమాలు తీసేసి ఆన్లైన్ లో(ఎనీ టైమ్  ధియేటర్ - ATT) రిలీజ్ చేసేసి సొమ్ము చేసుకున్నారు. సూర్యగారు ధైర్యం చేసి జ్యోతిక గారితో తీసిన పొన్ మాగల్ వందాల్ (బంగారు తల్లి) సినిమాను (ఓవర్ ద టాప్ - OTT) అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసి విజయం సాధించారు. మరల ఇప్పుడు సూర్య గారే నటించి నిర్మించిన ఆకాశం నీ హద్దురా సినిమాను ఇవాళ అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేశారు.  సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే ఉండటమే కాక మంచి విజయాన్ని నమోదుచేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకురాలు సూర్య గారి దగ్గరకు పూర్తి బౌండెడ్ స్రిప్ట్ తో ఆమె వెళ్ళలేదు ఒక పుస్తకం తీసుకువెళ్ళి కథ చెప్పి చదవమన్నారట. ఆయన ముందు షాక్ అయ్యి తర్వాత కథ నచ్చి సినిమాను చేసారు! ఒక సామాన్యుడు కలల ప్రపంచం నిజమై అతడు ఆకాశమే హద్దుగా ఎ...

Online Film Coaching (ఆన్లైన్ సినిమా శిక్షణ)

చిత్రం
 "ఆన్లైన్ సినిమా కోచింగ్" ఏశిక్షణా లేకుండా సినిమా తీయవచ్చు రాంగోపాల్ వర్మ గారిలా. కాని ఇప్పుడు సినిమా అనే మాధ్యమం కోట్ల రూపాయల పెట్టుబడులు  పెట్టి  నిర్మించే వ్యాపారంగా మారింది కాబట్టి రాజమౌళి గారిలా అందులో అడుగడుగునా ప్రేక్షకుడిని ఉత్కంఠతకు గురిచేస్తూ ఉండి జనాదరణ పొందడమే కాదు కాసులు కుమ్మరించేదిగా ఉండాలిప్పుడు సినిమా! కథను నమ్మి సినిమాను నిర్మించే నిర్మాత దగ్గర్నుండి అది కొనుక్కుని ఆడించే బయ్యర్ల వరకు మరీ ముఖ్యంగా సినిమా ధియేటర్లోకి టికెట్ కొనుక్కొని లోనికి ప్రవేశించే ప్రేక్షకుడు సంతృప్తి చెందే వరకు మనం సినిమాను రూపొందించగలిగేలా ఉండాలి. నిర్మాత సినిమాను ధియేటర్లో అమ్మినా ఆన్లైన్ లో  ప్రేక్షకుడు ధియేటర్ లో చూసినా ఆన్లైన్ లో డబ్బులు చెల్లించి మన అరచేతులలో ఇమిడిపోయిన ఫోన్లలో చూసినా అది ప్రేక్షకుడికి నచ్చడంతో పాటు కాసులు కుమ్మరించేదిగా వుండాలి. సినిమాపై ఆసక్తి వుండి సినిమా శిక్షణకోసం ఎదురు చూస్తున్నారా? ఐతే మీకిదే మంచి అవకాశం నంది అవార్డు గ్రహీత సినిమా డైరెక్టర్ అయిన మనోహర్ చిమ్మని గారు ఆన్లైన్లో సినిమా శిక్షణనిస్తున్నారు. సినిమా శిక్షణ తీసుకోవాలనుకునేవారు వెంటనే సంప్రద...

కొన్నిసార్లు..... పక్షులకు లేని వీసాలు, పాస్ పోర్టులు మనకెందుకు అనిపిస్తుంటుంది!

చిత్రం
కొన్నిసార్లు..... డార్విన్ సిద్దాంతం ఒక్కోసారి అక్షరాలా నిజమనిపిస్తుంటుంది. 'బలమైన జీవులన్నీ మనుగడ సాగిస్తాయి బలహీనమైన జీవులన్నీ మనుగడ కొనసాగించలేవు' ఉదహరణకు పులి జింకను వేటాడినపుడు పులి జింకను చంపి తిని అది మనుగడ సాగిస్తుంది కదా. నేడు ప్రపంచమంతా కరోనా కోరలు చాచి ప్రపంచ మానవాళి ఉనికిని ఒకసారి చిన్నాభిన్నం చేసింది! ఈవ్యాధి సోకితే రోగ నిరోధక శక్తి కల్గిన వారు కోలుకుంటున్నారు రోగ నిరోధక శక్తి లేని వారు త్వరగా అనారోగ్యం పాలై కొద్ది రోజుల వ్యవధిలోనే మరణిస్తున్నారు. ఇది గమనిస్తే డార్విన్ సిద్దాంతం నూటికి నూరుపాళ్ళు నిజం అనిపిస్తుంది కదా! కొన్నిసార్లు..... పక్షులకు లేని వీసాలు, పాస్ పోర్టులు మనకెందుకు అనిపిస్తుంటుంది! ఈప్రపంచమంతా మనదే కదా మరి మనం ఎందుకని వేరే దేశం వెళ్ళాలంటే అక్కడి అనుమతి తీసుకోవాలి, అక్కడకు వెళ్ళాక మన గుర్తింపును ధృవపరిచే పాస్ పోర్ట్ ను ఎందుకు చూపాలి?! మనమేమైనా వేరే గ్రహవాసులమా కాదు కదా! ప్రతీ దేశానికి అక్కడి చట్టాలు, వారి దేశీయ ఆర్ధిక పురోభివృధ్ధి కారణంగా ఒక్కోసారి డబ్బున్నా వారి అనుమతులు లేకుండా మనం మన ప్రపంచంలోనే మరో దేశంలోకి ప్రవేశించలేం, ఒకవేళ ప్రవేశిస్తే చట్టాల...

పూరీ గారు కులం చూడకుండా నాకలం దమ్ము చూసి నాకో అవకాశం ఇవ్వండి.

 తెలుగు సినిమా దర్శకులు పూరీ జగన్నాథ్ గారికి, ఓ దళిత యువకుడు రాసుకొను విన్నపము. సర్, నేను అంటరాని కులంలోను పేదరికంలోను జన్మించిన వాడిని. మేము ప్రభుత్వం నెల నెలా అందించే రేషన్ తీసుకుని బ్రతికే బడుగు బలహీన వర్గాల వారిమి. అలాగే ప్రభుత్వం ఉచితంగా అందించే తెలుగు మీడియం విద్యను అభ్యసించిన వాడిని. అంతేకాక ప్రభుత్వం ఉచితంగా అందించే వైద్య సదుపాయాలు సైతం పొందే పేదలం. సర్ మాకూ మగ్గిపోయిన పురుగులు పట్టిన కంపు కొట్టే రేషన్ బియ్యం తినాలని వుండదు కాని 365 రోజులూ కూలి కెళ్ళినా మంచి బియ్యం కొనడానికి డబ్బులు చాలవు.  ఎందుకంటే అందరి జీతాలు పెరుగుతాయి, నిత్యవసరాల ధరలూ పెరుగుతాయి కాని మా కూలి రేట్లు మాత్రం పెరగవుగా. సర్ నేను ఒళ్ళు దగ్గర పెట్టుకునే చదివాను కాబట్టే ఫెయిల్ అవ్వాల్సిన వాడిని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా. నన్నెవరూ ప్రోత్సహించలేదు , వెన్ను తట్టి ముందుకు నడిపించలేదు నాకు నేనే సర్ధి చెప్పుకుంటూ నన్ను నేనే ప్రోత్సహించుకుంటూ చదివా. ఇంకెవరైనా ప్రోత్సహించి ఉండి యుండుంటే ఇంకా బాగా చదివే వాడినేమో. మేము పేదలం కదా తెలుగు మీడియమే మాకు ఎక్కువ సర్ అందుకే ఏ అవకాశాలు లేని తెలుగు మీడియంలో చదివా. నేను డిగ్...