పోస్ట్‌లు

2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆకాశం నీ హద్దురా...!

చిత్రం
ఆకాశం నీ హద్దురా...! ఈరోజే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. కమల్ హాసన్ గారు విశ్వరూపం రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడి ఆయన తన సినిమాను ఆన్లైన్ లో రిలీజ్ చేస్తానన్నారు. ఈమధ్య రాంగోపాల్ వర్మ గారు కరోనా వచ్చి జనాలంతా సినిమా ధియేటర్లకు కూడా వెళ్ళే పరిస్ధితి సరికదా సినిమాలు తీసే పరిస్థితే లేదు ఐనా ఆయన మాత్రం తక్కువ బడ్జెట్ సినిమాలు తీసేసి ఆన్లైన్ లో(ఎనీ టైమ్  ధియేటర్ - ATT) రిలీజ్ చేసేసి సొమ్ము చేసుకున్నారు. సూర్యగారు ధైర్యం చేసి జ్యోతిక గారితో తీసిన పొన్ మాగల్ వందాల్ (బంగారు తల్లి) సినిమాను (ఓవర్ ద టాప్ - OTT) అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసి విజయం సాధించారు. మరల ఇప్పుడు సూర్య గారే నటించి నిర్మించిన ఆకాశం నీ హద్దురా సినిమాను ఇవాళ అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేశారు.  సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే ఉండటమే కాక మంచి విజయాన్ని నమోదుచేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకురాలు సూర్య గారి దగ్గరకు పూర్తి బౌండెడ్ స్రిప్ట్ తో ఆమె వెళ్ళలేదు ఒక పుస్తకం తీసుకువెళ్ళి కథ చెప్పి చదవమన్నారట. ఆయన ముందు షాక్ అయ్యి తర్వాత కథ నచ్చి సినిమాను చేసారు! ఒక సామాన్యుడు కలల ప్రపంచం నిజమై అతడు ఆకాశమే హద్దుగా ఎ...

Online Film Coaching (ఆన్లైన్ సినిమా శిక్షణ)

చిత్రం
 "ఆన్లైన్ సినిమా కోచింగ్" ఏశిక్షణా లేకుండా సినిమా తీయవచ్చు రాంగోపాల్ వర్మ గారిలా. కాని ఇప్పుడు సినిమా అనే మాధ్యమం కోట్ల రూపాయల పెట్టుబడులు  పెట్టి  నిర్మించే వ్యాపారంగా మారింది కాబట్టి రాజమౌళి గారిలా అందులో అడుగడుగునా ప్రేక్షకుడిని ఉత్కంఠతకు గురిచేస్తూ ఉండి జనాదరణ పొందడమే కాదు కాసులు కుమ్మరించేదిగా ఉండాలిప్పుడు సినిమా! కథను నమ్మి సినిమాను నిర్మించే నిర్మాత దగ్గర్నుండి అది కొనుక్కుని ఆడించే బయ్యర్ల వరకు మరీ ముఖ్యంగా సినిమా ధియేటర్లోకి టికెట్ కొనుక్కొని లోనికి ప్రవేశించే ప్రేక్షకుడు సంతృప్తి చెందే వరకు మనం సినిమాను రూపొందించగలిగేలా ఉండాలి. నిర్మాత సినిమాను ధియేటర్లో అమ్మినా ఆన్లైన్ లో  ప్రేక్షకుడు ధియేటర్ లో చూసినా ఆన్లైన్ లో డబ్బులు చెల్లించి మన అరచేతులలో ఇమిడిపోయిన ఫోన్లలో చూసినా అది ప్రేక్షకుడికి నచ్చడంతో పాటు కాసులు కుమ్మరించేదిగా వుండాలి. సినిమాపై ఆసక్తి వుండి సినిమా శిక్షణకోసం ఎదురు చూస్తున్నారా? ఐతే మీకిదే మంచి అవకాశం నంది అవార్డు గ్రహీత సినిమా డైరెక్టర్ అయిన మనోహర్ చిమ్మని గారు ఆన్లైన్లో సినిమా శిక్షణనిస్తున్నారు. సినిమా శిక్షణ తీసుకోవాలనుకునేవారు వెంటనే సంప్రద...

కొన్నిసార్లు..... పక్షులకు లేని వీసాలు, పాస్ పోర్టులు మనకెందుకు అనిపిస్తుంటుంది!

చిత్రం
కొన్నిసార్లు..... డార్విన్ సిద్దాంతం ఒక్కోసారి అక్షరాలా నిజమనిపిస్తుంటుంది. 'బలమైన జీవులన్నీ మనుగడ సాగిస్తాయి బలహీనమైన జీవులన్నీ మనుగడ కొనసాగించలేవు' ఉదహరణకు పులి జింకను వేటాడినపుడు పులి జింకను చంపి తిని అది మనుగడ సాగిస్తుంది కదా. నేడు ప్రపంచమంతా కరోనా కోరలు చాచి ప్రపంచ మానవాళి ఉనికిని ఒకసారి చిన్నాభిన్నం చేసింది! ఈవ్యాధి సోకితే రోగ నిరోధక శక్తి కల్గిన వారు కోలుకుంటున్నారు రోగ నిరోధక శక్తి లేని వారు త్వరగా అనారోగ్యం పాలై కొద్ది రోజుల వ్యవధిలోనే మరణిస్తున్నారు. ఇది గమనిస్తే డార్విన్ సిద్దాంతం నూటికి నూరుపాళ్ళు నిజం అనిపిస్తుంది కదా! కొన్నిసార్లు..... పక్షులకు లేని వీసాలు, పాస్ పోర్టులు మనకెందుకు అనిపిస్తుంటుంది! ఈప్రపంచమంతా మనదే కదా మరి మనం ఎందుకని వేరే దేశం వెళ్ళాలంటే అక్కడి అనుమతి తీసుకోవాలి, అక్కడకు వెళ్ళాక మన గుర్తింపును ధృవపరిచే పాస్ పోర్ట్ ను ఎందుకు చూపాలి?! మనమేమైనా వేరే గ్రహవాసులమా కాదు కదా! ప్రతీ దేశానికి అక్కడి చట్టాలు, వారి దేశీయ ఆర్ధిక పురోభివృధ్ధి కారణంగా ఒక్కోసారి డబ్బున్నా వారి అనుమతులు లేకుండా మనం మన ప్రపంచంలోనే మరో దేశంలోకి ప్రవేశించలేం, ఒకవేళ ప్రవేశిస్తే చట్టాల...

పూరీ గారు కులం చూడకుండా నాకలం దమ్ము చూసి నాకో అవకాశం ఇవ్వండి.

 తెలుగు సినిమా దర్శకులు పూరీ జగన్నాథ్ గారికి, ఓ దళిత యువకుడు రాసుకొను విన్నపము. సర్, నేను అంటరాని కులంలోను పేదరికంలోను జన్మించిన వాడిని. మేము ప్రభుత్వం నెల నెలా అందించే రేషన్ తీసుకుని బ్రతికే బడుగు బలహీన వర్గాల వారిమి. అలాగే ప్రభుత్వం ఉచితంగా అందించే తెలుగు మీడియం విద్యను అభ్యసించిన వాడిని. అంతేకాక ప్రభుత్వం ఉచితంగా అందించే వైద్య సదుపాయాలు సైతం పొందే పేదలం. సర్ మాకూ మగ్గిపోయిన పురుగులు పట్టిన కంపు కొట్టే రేషన్ బియ్యం తినాలని వుండదు కాని 365 రోజులూ కూలి కెళ్ళినా మంచి బియ్యం కొనడానికి డబ్బులు చాలవు.  ఎందుకంటే అందరి జీతాలు పెరుగుతాయి, నిత్యవసరాల ధరలూ పెరుగుతాయి కాని మా కూలి రేట్లు మాత్రం పెరగవుగా. సర్ నేను ఒళ్ళు దగ్గర పెట్టుకునే చదివాను కాబట్టే ఫెయిల్ అవ్వాల్సిన వాడిని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా. నన్నెవరూ ప్రోత్సహించలేదు , వెన్ను తట్టి ముందుకు నడిపించలేదు నాకు నేనే సర్ధి చెప్పుకుంటూ నన్ను నేనే ప్రోత్సహించుకుంటూ చదివా. ఇంకెవరైనా ప్రోత్సహించి ఉండి యుండుంటే ఇంకా బాగా చదివే వాడినేమో. మేము పేదలం కదా తెలుగు మీడియమే మాకు ఎక్కువ సర్ అందుకే ఏ అవకాశాలు లేని తెలుగు మీడియంలో చదివా. నేను డిగ్...

కులం మరక - మతం మచ్చ

  కులం మరక - మతం మచ్చ కులమేమో గుడిసేటిది మతమేమో మైనారిటీలది కులానికి - మతానికి లింకు పెట్టి  మా బ్రతుకులు బుగ్గిపాలు చేసారు. నేటికీ కులం మరక తొలగని పోట్లు పోడుస్తూనే వున్నారు మతం మచ్చ రుద్దుచూనే వున్నారు నాడు దైవ దర్శనమునకు భాగ్యం లేదు నేడు దైవమే మాచెెంతకు చేరినా మాకు భాగ్యం లేదు!  అదేమిటో నేడు అగ్ర కులస్థులు, బ్రాహ్మణోత్తములు సైతం క్రైస్తవ్యం స్వీకరించినా వారికి అంటని మచ్చ మాకే అంటింది! చిత్రం నేడు ఆ ఉత్తమోత్తములందరిని మా గురు స్థానములలో పైస్థాయిలో ఉండి మాకు క్రైస్తవ్యమును బోధించటం వల్ల దశమ భాగాలతో పోషించేది దరిద్ర హీనులమైన మేమే! కేవలం మతం మారినందుకే మాకు ప్రభుత్వ ఫీజు రాయితీ లేదు, ఏ రాయితీ లేదు అప్లికేషన్లకు అధిక రుసుం చెల్లించాలి ఉద్యోగాలలో ఒకే ఒక్క సీటు కూలి రేట్లు పెరగవు మా బ్రతుకులూ మారవు కూలి నాలికి పోయినా అక్కడా కులం పోట్లు తప్పవు హీనులంటూ దూరం దూరంగా జరిగేవారూ లేకపోలేదు డిగ్రీలు పట్టాలు చేతిలో వున్నా  మా బ్రతుకు పట్టాలు మాత్రం ఎక్కవుగా! ఎన్నో ఏళ్ళ ప్రభుత్వ అంధత్వ పాలనకు నిలువెత్తు సాక్ష్యం మా బ్రతుకులు! ఎందరో క్రైస్తవులుగా మారినా క్రైస్తవులంటే మాత్రం  మ...

అంతానికి ఆరంభం !

 కాలు కదిపితే కరోనా గడప దాటితే గడగడలాడాల్సొస్తుంది! గత కొన్నాళ్ళుగా దానితో సహజీవనం చేసి చేసి పాజిటివ్ నుండి నెగిటివ్ లోకి మారే వారి సంఖ్య పెరిగే సరికి గుంపులో గోవిందంలా తిరిగేస్తున్నారంతా కాని చిత్రంగా అది కూడా ఆగుంపులో గోవిందంలా తిరిగే అజాగ్రత్త పరుల పాలిట శాపమై మహమ్మారిలా ముద్దుపెట్టుకుని కౌగలించుకుంటోంది. జలుబు, జ్వరం వచ్చిందంటే చాలు జనాలు కంగారు పడిపోయి కరోనా వచ్చేసిందనే పరిస్థితీ దాపురించింది! వాస్తవమేమిటంటే కరోనా నిజంగా వచ్చినవారు కనుమరుగైపోతున్నారు. కాని కరోనా కరోనా అని కలవరించటం ప్రపంచం మానేసింది. ఎందుకంటే కరోనా కరీనాలా ఉందిప్పుడు జనాలకి!! పేరుకే ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి గాని ప్రజలు లాక్డౌన్ పాటిస్తున్నారా ఏంటి! ముందంటే మౌనం పాటించాం, చప్పట్లు కొట్టాం, దీపాలు వెలిగించాం కాని నేడు! కాలం(2020) మారినట్లు మనిషి మారిపోతాడు కదా! ఎందుకంటే మనిషి బ్రతకాలి బ్రతకాలంటే భయపడుతూ కూర్చోలేడు కాలంతో పాటే మనిషి గమనం కూడా ముందుకు సాగాలి. కరోనా అందరినీ భయపెట్టింది, కొందరిని కనుమరుగు చేసింది, మరికొందరి జీవితంలో మంచి గుణపాఠం నేర్పింది, ఇంకొందరి జీవితాలు అతలాకుతలం చేసేసింది, ఎందరివో...